జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ నెల 26న ఛలో మల్లారం కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమాన్నికి పోలీసుశాఖ తరఫున ఎటువంటి అనుమతులు లేవని ఎస్సై తెలిపారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఛలో మల్లారం కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
నిబంధనల ప్రకారం ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేచోట ఉండకూడదని వెల్లడించారు. ఎటువంటి అసత్యపు వార్తలు గానీ, అసత్యపు సమాచారం గానీ సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదని తెలిపారు. ఈ విషయంలో ఏటువంటి అనుమానాలు ఉన్న కొయ్యూరు పోలీస్ స్టేషన్నందు సంప్రదించాలని సూచించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?