జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పులలో పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం లోగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తామని వెల్లడించారు.
అనంతరం వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు, వ్యవసాయ అధికారులకు అప్పగిస్తామన్నారు. రైతును రాజుగా చూడాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి అన్నారు. అన్నదాతలు.. ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలని సూచించారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం దాల్చనుందా?