ETV Bharat / state

'నకిలీ విత్తనాల విక్రయదారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు' - నకిలీ విత్తనాల వార్తలు

విత్తనాలు రైతుల జీవితాలతో ముడిపడిన కీలక అంశమని హైకోర్టు పేర్కొంది. నకిలీ విత్తనాల విక్రయదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులు నకిలీ విత్తనాల వ్యాపారుల ఉచ్చులో పడకుండా చూడాలని సూచించింది. నకిలీ విత్తనాల విక్రయదారులపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది.

high court
high court
author img

By

Published : Jul 27, 2020, 5:31 PM IST

నకిలీ విత్తనాల విక్రయదారులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులు నకిలీ విత్తనాల వ్యాపారుల ఉచ్చులో పడకుండా చూడాలని సూచించింది. ములుగు జిల్లాలో నకిలీ మిరప విత్తనాలు అమ్మిన వారిపై చర్యలకు తీసుకోవాలని ఎంపీపీ సతీశ్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

నకిలీ విత్తనాల విక్రయాలపై వ్యవసాయ అధికారులు మేల్కొనాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 341 విత్తనాల విక్రయదారుల లైసెన్సులు రద్దు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ల్యాబ్ నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

లైసెన్సులు రద్దు చేసినప్పటికీ నకిలీ విత్తనాలు అమ్మే ప్రమాదం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవసాయశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించింది. విత్తనాలు రైతుల జీవితాలతో ముడిపడిన కీలక అంశమని న్యాయస్థానం తెలిపింది. ములుగు జిల్లాలో తీసుకున్న చర్యలపై ఆగస్టు 6 లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.