జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలోని మౌర్య దాబా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అంతలోనే పారిపోయేందుకు యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తాను చేసిన చోరీల చిట్టాను విప్పాడు. ఇప్పటికే 50కి పైగా వాహనాలు చోరీ చేసినట్టు అంగీకరించాడు. చివరిసారిగా జీడిమెట్ల మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడిన కేసులో గతనెల 9న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడని జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
50కిపైగా వాహనాలు చోరీ చేశాడు.. పోలీసులకు ఇలా చిక్కాడు
వరుసగా వాహనాలు చోరీ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.