అబ్బురపరుస్తున్న టెక్నోజిల్-2019 జనగామలో క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నోజిల్ 2019 ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు 300 పరిశోధన పత్రాలు రాగా...112 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు తయారు చేసిన నూతన సాంకేతిక పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.అగ్ని ప్రమాదాల అడ్డుకట్టకు రూపొందించిన రోప్ క్లైంబింగ్ విత్ ఫైర్ ఫైటింగ్ పరికరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు త్వరగా వేసేందుకు రైస్ ప్లాంటేషన్ యంత్రం తయారు చేశారు. ఆర్మీ సిబ్బందికి ఉపయోగపడే విధంగా ఓ విద్యార్థి స్పైడర్ రోబో తయారు చేశారు. అడవి ప్రాంతాల్లో ఉగ్రవాదుల జాడను, మందుపాతరలను కనిపెడుతుందని విద్యార్థులు వివరించారు.
ఇవీ చదవండి:పదో తరగతి పరీక్షలు ప్రారంభం