ETV Bharat / state

Farmers Stuck in flood at Jangaon : వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన సహాయక బృందాలు - జనగామలో వాగులో చిక్కుకున్న రైతులు

Farmers Stuck in flood at Jangaon : వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కూలీలు వాగులో చిక్కుకున్న ఘటన జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్దమడూరు వాగులో చోటుచేసుకుంది. వాగులో చిక్కుకు పోయిన నలుగురు రైతులు పోలీసులు, సహాయ బృందాల సాయంతో గ్రామస్థులు రక్షించారు. తాళ్ల సాయంతో వారిని అర్ధరాత్రి రక్షించిన అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Farmers Stuck in flood at Jangaon
Farmers Stuck in flood at Jangaon
author img

By

Published : Aug 6, 2022, 9:55 AM IST

వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన సహాయక బృందాలు

Farmers Stuck in flood at Jangaon : ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా దంచికొట్టిన వానకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాల్లో కాలనీలు నీటమునిగాయి. జనగామ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు వాగులో చిక్కుకుపోయారు.

Farmers Stuck in Vagu at Jangaon : జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్దమడూరు వాగులో చిక్కుపోయిన నలుగురు రైతులను గ్రామస్తులు, సహాయక బృందాలు రక్షించాయి. వ్యవసాయ పనులకోసం వెళ్లి తిరిగి వస్తుండగా భారీగా కురిసిన వర్షంతో వాగు పొంగింది. వాగులోంచి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు రైతులు వరద ఉద్ధృతికి కొట్టుకుని పోతూ చెట్లను పట్టుకున్నారు.

దీంతో విషయం తెలిసిన గ్రామస్థులు.. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని కాపాడాల్సిందిగా మంత్రి ఆదేశించడంతో.. పోలీసు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు రెండు గంటలపైగా శ్రమించి.. తాళ్ల సాయంతో వారిని అర్ధరాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం నుంచి కాపాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Labourers Stuck in Paleru Vagu : గత నెలలో సూర్యాపేటలో కూడా ఇలాగే వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కూలీలు వాగులో చిక్కుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం, కొత్తపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిన్న.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో 23 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలం నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం... రాత్రి కావడం, వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

బోటు సాయంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో డ్రోన్‌ సాయంతో బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఉదయం 6 గంటలకు బోటు సహాయంతో వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. బాధితులకు లైఫ్‌ జాకెట్లు అందజేసి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయక బృందాలకు కూలీలు ధన్యవాదాలు తెలిపారు.

Teacher Fell into Flood in Yadadri : ఇటీవలే యాదాద్రిలో ద్విచక్రవాహనంతో సహా వాగులో పడిపోయిన ఓ ఉపాధ్యాయిని గ్రామ సర్పంచ్ రక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు-కొలనుపాక మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్​ నుంచి బచ్చన్నపేటకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు కల్వర్టుపై స్కూటీ అదుపు తప్పడంతో కింద పడిపోయింది. నీటి ప్రవాహానికి ద్విచక్రవాహనంతో పాటు వాగులోకి కొట్టుకుపోయింది. సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది.

అదే సమయంలో అటుగా వెళ్తున్న బచ్చన్నపేట మండలం పరమడకేశాపూర్​ గ్రామ సర్పంచ్​ గిద్దెల రమేశ్​ ఉపాధ్యాయురాలిని గమనించాడు. స్థానికుల సహాయంతో వాగులోకి దిగి టీచర్​ను ఒడ్డుకు చేర్చాడు. సరైన సమయంలో స్పందించి.. ఉపాధ్యాయురాలి ప్రాణాలను కాపాడిన సర్పంచ్​ను స్థానికులు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.