యాదాద్రి జిల్లా అమ్మనబోలు గ్రామనికి చెందిన 34 సంవత్సరాల చంద్రకళ అనే మహిళ గత 15 రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. గమనించిన కుటుంబసభ్యులు జనగామలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. ఆమెకి వైద్యులు పరీక్షలు నిర్వహించి 8కిలోల కణతి(గడ్డ) ఉందని గుర్తించారు. డాక్టర్ రాజమౌళి ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: 'సోషల్' వివరాలు ఇస్తేనే అమెరికా వీసా