జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని తెరాస స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహక సమావేశం ధర్మసాగర్లో నిర్వహించారు. ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని, కష్టపడిన వారికీ, సీనియర్ నేతలకు తగిన గుర్తింపు లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే డా.టి రాజయ్య తెలిపారు.
ధర్మసాగర్లో తెరాస ఎన్నికల సన్నాహక సమావేశం ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తెరాసకు పూర్తి మద్దతిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికల గుర్తులను ప్రకటించిన ఈసీ