కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ తో సహా పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. దేశంలో 55శాతం మంది వ్యవసాయ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని.. వారిని దివాలా తీసేవిధంగా కేంద్ర ప్రభుత్వ బిల్లులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ శక్తులకు సహకరించేలా ఉన్న బిల్లులను అక్రమంగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. దేశ ఆహార భద్రతకు ముప్పు తెచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ఈ రాస్తారోకోలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ తో సహా పలు కార్మిక సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపాయి.