ETV Bharat / state

MONKEYS: వనం వదిలి జనంలోకి వస్తున్నాయ్.. ఇల్లు పీకి పందిరేస్తున్నాయ్‌..! - jangaon district latest news

MONKEYS: పల్లెల్లో ఇళ్ల పైకప్పులపై పరదాలు కప్పుతున్నారు. ఆవరణలో తియ్యని పండ్లు కాసే జామ చెట్లను కొట్టేస్తున్నారు. దీపావళికే కాదు.. ఏడాదంతా ఇళ్లలో టపాకాయలు నిల్వ ఉంచుకుంటున్నారు. ఒకప్పుడు వందల ఎకరాల్లో కూరగాయలు పండించిన, పెద్ద సంఖ్యలో చింత చెట్లున్న గ్రామాలు ఇప్పుడు పట్టణాల నుంచి వాటిని కొంటున్నాయి. ఇన్ని బాధలకు ఒకే ఒక్క కారణం.. మర్కటం. వనంలో ఉండాల్సిన వానరాలు జనారణ్యం బాట పడుతూ.. ఇళ్లపై, పంట పొలాలపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.

MONKEYS: వనం వదిలి జనంలోకి వస్తున్నాయ్.. ఇల్లు పీకి పందిరేస్తున్నాయ్‌..!

author img

By

Published : Feb 21, 2022, 5:33 AM IST

గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడద తారాస్థాయికి చేరింది. మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ సమావేశాల్లో ప్రధాన చర్చ ఈ సమస్యపైనే సాగుతోందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా కోతులు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. క్షేత్రస్థాయిలో మాత్రం అనేక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అడవులు తగ్గడంతో జనావాసాల్లోకి వచ్చి కోతులు తిష్ఠ వేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతుండటంతో వీధిలోకి వెళ్లే మాట అటుంచితే.. ఇళ్లలోనూ తలుపులు వేసుకుని ఉండాల్సి వస్తోంది. పెద్ద రైతులు కొందరు తమ పొలాల చుట్టూ రూ.వేలు వెచ్చించి సోలార్‌ ఫెన్సింగ్‌ వేసుకుంటున్నారు.

జనగామ పట్టణ జనాభా 52 వేలు కాగా.. కోతుల సంఖ్య 5 వేలకుపైనే. వాటి బాధ తప్పిస్తానంటూ గత మున్సిపల్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన 14వ వార్డు కౌన్సెలర్‌ పేర్ని స్వరూప రూ.2 లక్షలు ఖర్చు చేసి మరీ.. వాటిని పట్టించి అడవికి తరలించారు. సమస్య తీవ్రత నేపథ్యంలో అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోతులను పట్టుకుని అడవుల్లో వదలాలంటే గతంలో చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా ఈ అధికారాన్ని కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రీజనల్‌స్థాయి అధికారులకూ బదలాయించింది.

.

మచ్చుకు కొన్ని..

* జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో 54 వేల ఎకరాలకుగాను కూరగాయలు సాగయ్యేది 200 ఎకరాల్లోనే. ఏదులగూడెంలో కూరగాయలు సాగుచేసే కుటుంబాలు గతంలో 100 ఉండగా.. ఇప్పుడు ఒకట్రెండుకు పరిమితమయ్యాయి. ఇదే జిల్లాలో వందల సంఖ్యలో వచ్చే కోతులతో వేగలేమని జీతగాళ్లు చెప్పడంతో.. ఓ రైతు పొలంలోని 18 చెట్లనూ కొట్టించాడు. జఫర్‌గఢ్‌లో 3వేలకుపైగా కోతులుండగా.. ఇంటికొకరు చొప్పున బాధితులున్నారు. కోతులను పట్టి అడవిలో వదిలేసేందుకు ఇంటికి రూ.200 చొప్పున జమ చేసినా సమస్య పరిష్కారం కాలేదు.

* కోతుల దాడిలో 2 నెలల వ్యవధిలో 24 మంది గాయపడి.. దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు.
* సూర్యాపేట జిల్లాలో గతంలో ఖరీఫ్‌లో పెసర, కంది, నువ్వులు, వేరుసెనగ సాగయ్యేవి. కోతుల బెడదతో ఆ పంటలను దాదాపు వేయడం లేదు. పండ్ల తోటలకు కుక్కలను రైతులు కాపలా పెట్టుకుంటున్నారు.
* రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లిలో పాఠశాల తరగతి గదుల్లోకి కోతులు చొరబడటమే కాదు.. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనాన్నీ లాక్కెళ్లిపోతున్నాయి.

సమస్య తగ్గాలంటే..

కోతుల నివరణకు అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, పశుసంవర్ధక శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ కమిటీ ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సంతాన నిరోధకశస్త్రచికిత్సలు, హరితహారంలో పండ్ల మొక్కలు నాటడం.. ఇందులోని ప్రధాన సూచనలు.

దీర్ఘకాలిక చర్యలు: సంతాన నిరోధక శస్త్రచికిత్సలు పెంచాలి. ఇందుకు రూ.15.40 కోట్ల ఖర్చవుతుందని అంచనా. హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని వెటర్నరీ ఆసుపత్రుల్లో ఆడ కోతులకు స్టెరిలైజేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మగ కోతుల శస్త్రచికిత్సకు 32 జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.

స్వల్పకాలిక చర్యలు: పంట పొలాల చుట్టూ నైలాన్‌ నెట్లను ఉపయోగించాలి. ఇందుకు ఎకరాకు రూ.6 వేల ఖర్చు కాగా.. 70-80 శాతం ప్రయోజనం చేకూరుతుంది. 4,5 ఎకరాలకు ఒకటి చొప్పున శబ్దాలు చేసే పరికరాలు వాడాలి. ధర రూ.3 వేలపైనే. 5-7 ఎకరాలు ఒక యూనిట్‌గా పొలాల చుట్టూ సోలార్‌ కంచెలు ఏర్పాటు చేయాలి. దీనికి సుమారు రూ.13 వేల వ్యయం కాగా.. 70-90 శాతం ప్రయోజనం కలుగుతుంది.

.

హిమాచల్‌లో ఇలా..

హిమాచల్‌ప్రదేశ్‌లో వానరాల కారణంగా ఏటా రూ.500-600 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లుతోంది. వాటి నివారణకు ఏడు సంతాన నిరోధక కేంద్రాలు నెలకొల్పి.. 2007 నుంచి 2 లక్షల కోతులకు శస్త్రచికిత్సలు చేశారు. ఈ చర్యతో మర్కటాల సంఖ్య ఒకటిన్నర లక్షలకు తగ్గినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఆరుతడి పంటల్నీ వదలడం లేదు

ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయమంటోంది. కోతులు వాటిని నాశనం చేస్తాయి. ఏ పంట వేసి బతకాలో అర్థం కావట్లేదు. పొలం చుట్టున్న చెట్లనూ కొట్టేయాల్సి వస్తోంది.- కర్రోళ్ల యాదయ్య, లింగంపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా

రొట్టెలు, వంట పాత్రల్ని ఎత్తుకెళ్తున్నాయి..

మా గ్రామంలో మొక్కజొన్న, వరి పంటల్ని కోతులు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి టమాటాలు, రొట్టెలు, పప్పుడబ్బాలు, వంటపాత్రలు ఎత్తుకెళ్తున్నాయి. బెదరగొడదామంటే పైకి వస్తున్నాయి. -షరీఫ్‌, మోమిన్‌కలాన్‌, వికారాబాద్‌ జిల్లా

ఆడ కోతులకు ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సల ప్రతిపాదన

మగ కోతులకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు సులభం. ఆడ కోతులకు కుట్లు ఎక్కువ పడతాయి. నయం కావడానికి చాలా సమయం పడుతుంది. ల్యాప్రోస్కోపీ విధానంలో చిన్న కోతతో సులభంగా, వేగంగా శస్త్రచికిత్స చేయవచ్చు. నిర్మల్‌కు చెందిన ఇద్దరు వెటర్నరీ వైద్యులు హిమాచల్‌ప్రదేశ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని వెటర్నరీ ఆసుపత్రుల్లో ఆడకోతులకు ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సల ప్రతిపాదన ఉంది.-శంకరన్‌, ఓఎస్డీ, అటవీశాఖ

అడవుల్లో పండ్ల మొక్కలు నాటాలి..

గతంలో అడవుల్లో అనేక రకాల పండ్ల చెట్లుండేవి. వాటిని తింటూ అక్కడే ఉండేవి. ఒక మర్రిచెట్టుపై వెయ్యి కోతులు నిద్రపోతాయి. ఇప్పుడు అక్కడ పండ్ల చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఆహార, ఆవాస సమస్యలతో జనావాసాల్లోకి వస్తున్నాయి. సమస్య నివారణకు అడవుల్లో పెద్దసంఖ్యలో పండ్ల మొక్కలు నాటాలి. -ప్రొఫెసర్‌ హంపయ్య, మాజీ ఛైర్మన్‌ ఉమ్మడి రాష్ట్ర జీవవైవిధ్య మండలి

ఇదీ చూడండి: Pawan Kalyan Fell Down: ఫ్యాన్ అత్యుత్సాహం.. కిందపడ్డ పవన్​ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.