జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే రాజయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
రంజాన్ మాసం ప్రారంభమైనందున ముస్లింలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. అనవసరంగా బయటకు రాకూడదన్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసిన తెరాస నేత శ్రీధర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.