ETV Bharat / state

మొక్కలు నరికిన వ్యక్తిపై కేసు - జనగామ జిల్లా తాజా వార్తలు

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికి వేస్తూ తగలబెడుతున్న ఓ వ్యక్తికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MLA muthireddy counseling to a person who cuts the plants at jangaon road
మొక్కలు నరికిన వ్యక్తికి ఎమ్మెల్యే కౌన్సెలింగ్
author img

By

Published : Jun 7, 2020, 12:37 PM IST

చెట్లను బతికించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. వాటిని నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. జనగామ-నర్మెట్ట రహదారి పక్కన బత్తిని అశోక్ అనే వ్యక్తి హరితహారంలో నాటిన మొక్కలను నరికివేస్తూ తగలబెట్టాడు. అదే సమయంలో రహదారిపై అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి.. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల అశోక్​పై కేసు నమోదు చేసినట్లు జనగామ పట్టణ సీఐ మల్లేశ్​ తెలిపారు. ఎమ్మెల్యే సూచన మేరకు అశోక్​తో అదే ప్రాంతంలో మరో 5 మొక్కలను నాటించినట్లు తెలిపారు.

ఇదీచూడండి: బస్సు ఎక్కాలంటే గుబులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.