ETV Bharat / state

సీఎం కేసీఆర్​ హయాంలోనే కుల వృత్తులకు లబ్ది చేకూరింది: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - Minister Srinivas Gowda releases fish fry in Bommakoor reservoir

జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ జలాశయంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరై.. విడుదల చేశారు.

Minister Srinivas Gowda releases fish fry in Bommakoor reservoir
సీఎం కేసీఆర్​ హయాంలోనే కుల వృత్తులకు లబ్ది చేకూరింది: మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Aug 30, 2020, 2:34 PM IST

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులకు ఆర్థికంగా లబ్ధి చేకూరిందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ జలాశయంలోఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్యలతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 23 జిల్లాలకు సబ్సిడీలో 2 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే.. ఇప్పుడు ఉచిత చేప పిల్లలతో పాటు, మత్స్య పరిశ్రమ శాఖ ద్వారా వాహనాలు సైతం అందిస్తున్నామని తెలిపారు. గతంలో నీళ్లు లేక కరవు కాటకాలతో ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ఎటు చూసినా జలకళ సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి.. ప్రపంచానికి బొమ్మల హబ్​గా భారత్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.