జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. సిద్ధార్థ నగర్లో జరిగిన వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. చిన్న పిల్లలతో కలిసి రంగులు పూసుకుని.. హోలీ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. హానికరమైన రంగులు వాడకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో పండగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.