కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని వలస కూలీలకు బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
గ్రామాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు అందించాలని సూచించారు. వలస కూలీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తీసుకుని రావడం వల్ల వరి బాగా పండిందన్నారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేసేందుకు.. ముఖ్యమంత్రి రూ.30 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు సమితి సభ్యులు చూసుకోవాలని కోరారు.
ఇవీచూడండి: సీఎం సహాయనిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు