ETV Bharat / state

రైతులను బతికిచేందుకే నియంత్రిత సాగు విధానం : మంత్రి ఎర్రబెల్లి - జనగామా జిల్లా వార్తలు

రైతును రాజు చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ప్రతిపక్షాలు అనవసరమయిన ఆరోపణలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహించారు. జనగామ జిల్లా కేంద్రంలో నియంత్రిత పంట సాగుపై రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగహన కార్యక్రమం నిర్వహించారు.

Minister Errabelli About Crop Plan Of State Government
రైతులను బతికిచేందుకే నియంత్రిత సాగు విధానం : మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : May 24, 2020, 11:53 PM IST

జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పాల్గొన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్​, రైతుబంధు, రుణమాఫీ వివిధ పథకాలతో తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు తక్కువ ధరకు పంటలు కొని.. మన రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, ఆ పంటలు మనమే పండించుకొని ఇతర రాష్ట్రాలకు లాభానికి ఎగుమతి చేసుకునేలా సీఎం ఆలోచించారని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్టులు కట్టి సాగునీటి వసతి కల్పిస్తున్నారని తెలిపారు. రైతులంతా ముఖ్యమంత్రి చెప్పిన పంటలు వేసి.. లాభాలు అర్జించాలని కోరారు. రైతును బాగుచేయడం కోసం ముఖ్యమంత్రి పని చేస్తుంటే ప్రతిపక్షాలు పని గట్టుకొని విమర్శలు చేస్తున్నాయని, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ నేతలే అప్పుడు పోతిరెడ్డిపాడుకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారని గుర్తు చేశారు. జనగామ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోతిరెడ్డిపాడుకు శ్రీకారం చుట్టి నాలుగు గేట్లుగా ఉన్న డిజైన్​ను తొమ్మిది గేట్లుగా మార్చి ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.