జనగామ జిల్లా బచ్చన్నపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండలంలోని నక్కవానిగూడెం శివారు గ్రామం సదాశివపేటకు చెందిన ఈదులకంటి వెంకట్‌రెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వెళ్లాడు.
వెళ్తున్న ఆయనను మండల కేంద్రంలోని ఆలేరు రోడ్డులో చేర్యాల వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనగా... వెంకట్ రెడ్డి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. మృతుడికి భార్య చంద్రకళ, కూతురు, కుమారుడు ఉన్నారు.
ఇవీచూడండి: పాన్‌కార్డుతో ఆధార్ లింక్ చేశారా?... చివరి తేదీ ఇదేనండీ