ETV Bharat / state

ఫోర్జరీ చేశాడు... బిల్​ కలెక్టర్​ అయ్యాడు... - సంతకం ఫోర్జరీ వార్తలు

తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి... బిల్​ కలెక్టర్​గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు... జరిగింది ఎక్కడో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

man-arrested-in-sign-forgery-at-jangaon
ఫోర్జరీ చేశాడు... బిల్​ కలెక్టర్​ అయ్యాడు...
author img

By

Published : Jun 11, 2020, 3:00 PM IST

జనగామ మున్సిపల్ కార్యాలయంలో తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి బిల్​ కలెక్టర్​గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. పట్టణంలోని ధర్మకంచకు చెందిన మామిడి గణేష్​.. ఫోర్జరీ చేసి మున్సిపల్​ కార్యాలయంలో బిల్​ కలెక్టర్​గా ఉద్యోగం సంపాదించాడు. విషయాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీ చేసినట్లు రుజువు కావడంతో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. అతనిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని వెల్లడించారు.

ఇవీ చూడండి: 'ఎన్ని సమస్యలొచ్చినా.. ధైర్యంగా ముందుకు సాగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.