ETV Bharat / state

'సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుండాలి' - జనగామ జిల్లా వార్తలు

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ మండల కేంద్రంలో నిర్వహించిన లయన్స్​ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆ క్లబ్​ గవర్నర్​ పొట్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ​సమాజ సేవలో క్లబ్​ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు.

lions club meet in jangaon district
'సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుండాలి'
author img

By

Published : Jun 20, 2020, 1:08 PM IST

సమాజసేవలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని ఆ క్లబ్ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నూతన కార్యవర్గం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో క్లబ్ సభ్యులు రక్షణ చర్యలు తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

సమాజంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, తదితర కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమాజ హితమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ లయన్స్​ క్లబ్ సేవలందిస్తూ ఉండాలని సూచించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి వీలుగా ప్రజలకు మాస్కుల పంపిణీ నిర్వహించారు.

ఇవీ చూడండి: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆకట్టుకున్న పాసింగ్​ అవుట్​ పరేడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.