ఆడపడుచులకు పెద్దన్నగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నారని.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవురుప్పుల మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. గత ప్రభుత్వాలకు, కేసిఆర్ పాలనకు తేడా చూడాలని సూచించారు. ఇంటి ముందు చెత్త వేస్తే జరిమానా విధించేలా.. గ్రామపంచాయతీ తీర్మానించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బస్సు టైర్ పంచర్.. మెట్రో పిల్లర్‌కు ఢీ