గోదావరి జలాలను ఎత్తు ప్రదేశాలకు తీసుకువచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కొండ పోచమ్మ జలాశయంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఒక ధాన్యాగారంగా మారిందని కడియం శ్రీహరి తెలిపారు.
ఇవీ చూడండి: 'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానమే..'