ETV Bharat / state

'ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుదాం... గ్రామాలను వనాలు చేద్దాం'

గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి... గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలని జనగామ కలెక్టర్ నిఖిల సూచించారు. హరితహారంలో భాగంగా స్టేషన్ ఘనపూర్​లో ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మొక్కలు నాటారు.

janagoan collector nikhila talk about harithaharam in station ghanpur
'ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుదాం... గ్రామాలను వనాలుగా చేద్దాం'
author img

By

Published : Jun 25, 2020, 5:19 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని జనగామ కలెక్టర్ నిఖిల సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మోడల్ కాలనీలో ఎమెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను నాటాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి... గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలన్నారు.

హరితహారంతోపాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని... ప్రతి పల్లెలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.

ఇవీ చూడండి: భవిష్యత్తు తరాలను పచ్చగా చేసేందుకే అడవుల పునరుద్ధరణ: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.