జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు విషయం తెలుసుకొని పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. జంగా రాఘవ రెడ్డి తన స్వగ్రామం టేకులగూడెంలో ఓ వ్యక్తిపై దాడికి దిగాడనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే కాకుండా మరికొన్ని కేసులు సైతం ఆయనపై నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా రాఘవరెడ్డి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు.
రాఘవరెడ్డి గురువారం తన స్వగ్రామానికి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ మేరకు అరెస్టును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను మరో ప్రదేశానికి తరలించారు. తమ నాయకుడి సమాచారం తెలపాలంటూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అతనిని కలిసేందుకు రాఘవరెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణ