యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన పరిదే మల్లయ్య సోదరులు జనగామ జిల్లా కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 10లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఆర్నెళ్లకోసారి 36వేల రూపాయలు వడ్డీ కడుతున్నారు.. కానీ ఈసారి కట్టాల్సిన వడ్డీ ఆలస్యం అయినందున బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి వేధించడంతో మల్లయ్య తీవ్ర మనస్తాపం చెంది పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకు అధికారుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని శవాన్ని బ్యాంకులోకి తీసుకెళ్లారు. మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
ఇదీ చూడండి: సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల