జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన 74 వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరై... జాతీయ జెండా ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి వల్ల వేడుకలు ఘనంగా నిర్వహించుకోలేకపోతున్నామని అన్నారు. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరణాల రేటులో రాష్ట్రం చివరి స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి... కరోనాను పారదోలాలని విజ్ఞప్తి చేశారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జెండా ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా, స్వతంత్ర భావాలతో జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రక్కసి నుంచి బయటపడేందుకు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, హమీద్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.