ETV Bharat / state

Husband Kills Wife With Electric Shock : మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త.. విద్యుత్ షాక్​ పెట్టి.. - మద్యం మత్తులో భార్యను హతమార్చిన వ్యక్తి

Husband Kills Wife With Electric Shock : చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మద్యం మత్తులో చిక్కుకుని చాలామంది ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో విచాక్షణ రహితంగా ప్రవర్తిస్తూ.. ఇతరుల ప్రాణాలను బలిచేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యని చితకబాది.. విద్యుత్ షాక్​ పెట్టి మరీ హతమార్చాడు.

Man Kills Wife Under Influence Of Alcohol in Jangaon
Man Kills Wife
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 1:59 PM IST

Husband Kills Wife With Electric Shock in Jangaon : ఇటీవల కాలంలో వయసుతో తేడా లేకుండా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఈ మహమ్మరికి బానిస కావలం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎంతోమంది దంపతులు, అన్నదమ్ముల మధ్య కలహాలు, స్నేహితుల మధ్య గొడవలు చోటు చేసుకుని.. విడిపోయిన పరిస్థితులు కూడా చాలానే చూశాం. మద్యం మత్తులో జరిగే యాక్సిడెంట్స్​కు అయితే లెక్కే లేదు. చాలామంది మద్యం మత్తులో హత్యలకు, అత్యాచారాలకు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మద్యం మత్తులో పడిన వ్యక్తులు సృష్టించిన అరాచకాలెన్నో ఉన్నాయి. ఇలా మద్యం మత్తులో తన ఇంటిదీపాన్నే ఆర్పేసుకున్నాడు ఓ వ్యక్తి.

Father Killed Daughter in Hyderabad : రానంటూనే వెళ్లి.. నాన్న చేతిలో బలి.. భార్యపై కోపంతో కూతురిని చంపిన తండ్రి

Husband Kills Wife Under Influence Of Alcohol : నిత్యం తాగుడుకు బానిసై ఓ వ్యక్తి భార్యను కర్రతో కొట్టి.. విద్యుత్ షాక్(Electric Shock) పెట్టి.. ఉరివేసి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడెం శివారు కాశీంనగర్​లో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పామునూరు శివారు కాశీగూడెంకు చెందిన కాశీం, మదారిబీ దంపతుల పెద్ద కుమార్తె హజరత. కుమార్తెను దంపతులు తొర్రూర్ మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన గాంధారి, ఫాతిమాబీ కుమారుడు అమీర్​కు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు.

Husband Kills Wife : ఈ క్రమంలో దంపతులు బతుకుదెరువు కోసం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడెం గ్రామ శివారులోని కాశీంనగర్​కు వచ్చి బండకొట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అమీర్ తాగుడుకు బానిసగా మారి రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. అంతటితో ఆగకుండా.. తాగి వచ్చి హజరతను చితక బాదేవాడు. పలుమార్లు బంధువులు, కుటుంబ సభ్యులు అమీర్​ను మందలించిన ఫలితం లేకుండా పోయింది. అతను ఏమాత్రం బుద్ధిమార్చుకోలేదు.

Husband Kills Wife Under Influence Of Alcohol : ఇదే క్రమంలో అమీర్ మంగళవారం సాయంత్రం కూడా తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తు(Husband Kills Wife)లో ఉన్న అతను భార్య హజరతపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మధ్య రాత్రి సమయంలో మళ్లీ కర్రతో చితకబాది.. చీరతో పడుకున్న చోటే ఊరేసి.. విద్యుత్ షాక్ పెట్టి కడతేర్చాడు. బుధవారం ఉదయం లేచి ఏం తెలియనట్లుగా ఇద్దరు పిల్లలను తీసుకుని పారిపోవాలని అనుకున్నాడు.

అలా పారిపోతున్న అమీర్​ను గుర్తించిన గూడెం వాసులు పట్టుకొని విచారించగా.. అసలు నిజం బయటపెట్టాడు. వెంటనే వారు పోలీసులకు అప్పజెప్పారు. ముందే గట్టిగా మందలించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని బంధువులు బోరున విలపిస్తున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పందన

Hyderabad Man Kills Daughter : భవిష్యత్​లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.