జనగామ జిల్లా బండపల్లెకు చెందిన ముస్త్యాల అంజయ్యకు 30 రోజులకు విద్యుత్ బిల్లు 5లక్షల 30వేల రూపాయలకు పైగా వచ్చింది. అది చూడగానే విస్మయం చెందిన ఆయన ఆ బిల్లును ఎలా కట్టాలో తెలియక లబోదిబోమంటున్నాడు. ఈ విషయాన్ని’ ఏడీఈ దామోదర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఒక్క నెలకు రూ.5లక్షలు బిల్లు రావడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సిబ్బంది సదరు వినియోగదారుడి ఇంటికి వెళ్లి మీటరు రీడింగ్‌ను పరిశీలించారు. అందులోని రీడింగ్‌ని తప్పుగా నమోదు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని బిల్లును మార్చారు. మార్పు చేసిన తర్వాత అంజయ్య ఇంటికి కేవలం రూ.162 మాత్రమేనని వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మీటరు రీడింగ్ నమోదు చేసే వ్యక్తి కొత్తగా రావటం వల్లే పొరపాటు జరిగిందని స్పష్టం చేశారు. మరెక్కడైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే నేరుగా కార్యాలయానికి వస్తే పరిశీలించి సరి చేస్తామని వివరించారు.
ఇవీచూడండి: 'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే'