ETV Bharat / state

ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గంగమ్మ ఒడికి గణనాథుడు - వినాయక నిమజ్జనాలు

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న బొజ్జగణపయ్య ప్రశాంత వాతావరణం నడుమ గంగమ్మ వడికి చేరాడు. గణనాథుడి శోభాయాత్రలో, నిమజ్జనం ప్రాంతాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

ganesh idols immersion at station ghanpur in janagan district
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు
author img

By

Published : Sep 1, 2020, 8:35 AM IST

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు సోమవారం గంగమ్మ ఒడికి చేరడంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సోమవారం సాయంకాలం గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అందంగా అలంకరించిన వాహనాలపై గత తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన వినాయకుని నెలకొల్పి వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

కరోనా నేపథ్యంలో భక్తులు లాక్​డౌన్ నిబంధనలు పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం చేసే జలాశయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గణనాథుడి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రదర్శనలు డీజె సౌండ్ లేకపోవడం వల్ల శోభాయాత్ర చిన్న పోయినట్లు కనిపించినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణం నడుమ బొజ్జగణపయ్య గంగమ్మ వడికి చేరాడు.

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.