జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు కరాటేలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు బాలునాయక్. కొన్నేళ్లుగా ఉచిత శిక్షణలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేశారు. ఈయన శిక్షణలో రాటుదేలిన ఎంతో మందిని జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఈయన దగ్గర శిక్షణ పొందిన పలువురు శిక్షకులుగా మారారు.
ధైర్యంగా వెళ్తున్నాం
నిత్యం ఉదయం, సాయంత్రం పాలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఆత్మరక్షణ విద్యలో తర్ఫీదునిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి నుంచి బైటకు రావడానికే బయపడే తామంతా ఇప్పడు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లగలం అంటున్నారు విద్యార్థులు.
కరాటే కేవలం ఆపత్కాల సమయంలో ఆత్మరక్షణకే కాదు. ఆరోగ్యం మెరుగుపర్చుకోవడానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు శిక్షకుడు బాలునాయక్. ప్రభుత్వ సాయం అందిస్తే మరింత మందిని తీర్చిదిద్దుతామంటున్నారు. విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి ఆత్మరక్షణ విద్యలో పట్టు సాధించడం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.