వేసవికాలంలో మండుటెండలకు మనుషులే కాదు.. పశు పక్షాదులు కూడా దాహంతో అల్లాడిపోతున్నాయి. వాటి సంరక్షణకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త యంజాల ప్రభాకర్ పక్షుల కోసం ప్రత్యేకంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన ఫంక్షన్ హాల్ సమీపంలో పక్షుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేయించి మానవత్వం చాటుకున్నారు.
వేసవి తీవ్రత వలన పక్షులు అలమటిస్తూ ఉన్నందున వాటికి దాహం తీర్చడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో పక్షుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.