Farmers preparing pady seedlings: వరి సాగుపై గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యాసంగి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెబుతోందని... రైతులు నష్టాలు మూటగట్టుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. కొనుగోలు కేంద్రాలూ ఉండబోవని కరాఖండిగా చెప్పింది. కానీ జనగామ జిల్లా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. చిల్పూరు, స్టేషన్ ఘన్‌పూర్, తరిగొప్పుల, నర్మెట, దేవరుప్పుల తదితర మండలాల్లో రైతులు యాంసంగి కోసం నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.
వరి తప్ప మరొకటి సాగు చేయలేం..
Farmers towards paddy:నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు... వరికి బదులు ఇంకేమి పండిస్తామంటూ రైతలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు పొలం వేయడంతో ఇప్పుడు వేరే పంటలు పండించే పరిస్థితి లేదని చెబుతున్నారు. వరి తప్ప మరొకటి సాగు కాదని రైతులు అంటున్నారు.
ప్రత్యామ్నాయం గురించి ఎవరేం చెప్పలే...
ప్రత్యామ్నాయ పంటల గురించి తమకెవరూ ఏమీ చెప్పలేదని జనగామ రైతులు అంటున్నారు. యాసంగి పంట ప్రభుత్వమే కొనాలని కోరుతున్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ప్రభుత్వం చెబుతుండటంతో ప్రత్యమ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.
మా దగ్గరైతే వేరే పంట పండదు. కాబట్టి వరి పంట వేస్తేనే మేము బతుకుతాం. ప్రభుత్వం వరి ధాన్యం కొనా అంటే ఎట్ల అవుద్ది... కొనాలే. కొనక తప్పదు. కొంటనే మంచిగుంటది. ఇవాళ కొనా అంటున్నావు. రేపు ఎన్నికలు వస్తాయి. ఎలా గెలుస్తావు జనాన్ని కాదని... మేము ఓటేయకపోతే గెలుస్తావా... చెప్పేదీ?- రైతు
ఇదీ చదవండి: Dharmapuri Arvind: తెరాస ఎమ్మెల్యేలు బియ్యం రీసైక్లింగ్ దందాలో ఉన్నారు: ఎంపీ అర్వింద్