errabelli warning to bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 500 మంది గూండాలతో పాదయాత్ర నిర్వహిస్తున్నాడని, తెరాస కార్యకర్తలే కాక సామాన్య జనాల పైన కూడా రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. దేవరుప్పులలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజే బండి సంజయ్ ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం విచారకరమన్నారు. ఈ ఘటనతో భాజపా వైఖరి మరోసారి బయట పడిందని, ప్రజల్లో సానుభూతి పొందడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఇవాళ్టి ఘర్షణలో గాయపడిన తెరాస శ్రేణులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరామర్శించారు. జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తల నుంచి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
బండి సంజయ్ వెంట ఉన్న 500 మంది గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మా కార్యకర్తలు గాయపడ్డారు. దాడిలో సత్తెమ్మ అనే సామాన్యురాలు కూడా గాయపడింది. జాతీయ జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన ఆమెపై కూడా దాడి చేశారు. ఈ విషయంలో పోలీసుల స్పందన కూడా సరిగా లేదు. ఈ ఘటనను నేను డీజీపీ దృష్టికి తీసుకెళ్తా. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్రమంత్రి
ఇవీ చదవండి..