జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పారిశుద్ధ్య కార్మికులకు విద్యుత్ శాఖ సిబ్బంది నిత్యావసర సరుకులు అందజేశారు. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వారు చేస్తున్న సేవలు అభినందనీయమని సీఐ కొనియాడారు.
కరోనా కారణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం విధులకు హాజరౌతున్నారని తెలిపారు. వారి అవసరాల కోసం విద్యుత్ శాఖ సిబ్బంది సాయం చేయడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి : అవయవ మార్పిడికీ తప్పని అంతరాయం!