గత ఏడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులను, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ దస్తగిరి కోరారు. శనివారం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నిత్యావసరాల పంపిణీ చేశారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయడంతో వేతనాలు లేక ఉపాధ్యాయులు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం ఉడతా భక్తిగా 50 మందికి నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు