జనగామ జిల్లా కేంద్రంలో జీఎస్టీ పరిహారాలను రాష్ట్రాలకు చెల్లించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2 లక్షల 35వేల కోట్ల రాబడి తగ్గిందని.. రాష్ట్రాలు అప్పులు చేసైనా.. పరిపాలన కొనసాగించాలని చెప్పడం సిగ్గులేని చర్య అని ఆయన మండిపడ్డారు. వెంటనే రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పౌరహక్కుల నేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని.. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తన కారుపై దాడి జరిపిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్