జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా లింగాల ఘన్పూర్లో జిల్లా పాలనాధికారి నిఖిల బస చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లాలో ప్రతి శనివారం పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లెప్రగతిలో చివరి స్థానంలో నిలిచిన గ్రామాల్లో పర్యటించి.. ఆ గ్రామాలను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం, పారిశుద్ధ్యం సక్రమంగా అమలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!