పట్టణ ప్రగతిలో జనగామ జిల్లా ముందుండాలని కలెక్టర్ నిఖిల అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పనులు పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ మున్సిపాలిటీలోని 21, 23 వార్డుల్లో ఆమె పర్యటించారు. 21వ వార్డు కౌన్సిలర్ కర్రె శ్రీనివాస్, వార్డు ప్రత్యేక అధికారి ఇరిగేషన్ డీఈ రవీందర్ పనితీరును మెచ్చుకున్నారు.
అనంతరం 23 వార్డులోని వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని మహిళలకు సూచించారు.
ఇవీచూడండి: సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన సీఎం కేసీఆర్