జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో కాలువ నిర్మాణ పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. నవాబుపేట్ జలాశయం నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు గోదావరి జలాలను తరలించే ఆ కాలువ గురించి అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి : మిత్రుడిలా వచ్చిన కొండముచ్చు... శత్రువులా దాడి చేసింది