పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్లు సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారని జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది జీవితాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: ఐదు పైసలకే.. ఒకటిన్నర ప్లేట్ చికెన్ బిర్యానీ!