ETV Bharat / state

Bhoodan Movement Lands: భూదాన భూములు అన్యాక్రాంతం..

Bhoodan Movement Lands: కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. భూదానోద్యమం కింద దళితులకు ఇచ్చిన భూములను సైతం.. యథేచ్చగా కబ్జా చేసేస్తున్నారు. అక్రమదారుల్లో పట్టాలు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో వంద ఎకరాలపైగా ఉన్న భూములపై కన్నేసిన రియల్ మాఫియా.. వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు.

bhoodan movement lands
bhoodan movement lands
author img

By

Published : Feb 5, 2022, 5:38 AM IST

Bhoodan Movement Lands: భూదాన భూములు అన్యాక్రాంతం..

Bhoodan Movement Lands: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం... మేకలగట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని 206 సర్వే నెంబరులోని 120 ఎకరాల భూమి ఇది. భూదానోద్యమ సమయంలో ఆచార్య వినోభా బావేకు నెల్లుట్ల కేశవరావు అనే భూస్వామి ఈ భూములను దానంగా ఇచ్చారు. 1975లో ప్రభుత్వం వీటిని భూముల్లేని 44 మంది దళితులకు అప్పగించింది. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూదాన యజ్ఞ బోర్డు హక్కు పత్రాలను కూడా అందజేసింది. అయితే ఇదంతా గుట్ట ప్రాంతం. సాగు కాస్త కష్టమే. దీంతో లబ్ధిదారులు సాగు చేయలేదు.

నక్సల్స్ పేల్చేయడంతో..

1991 సంవత్సరంలో.. రఘునాథపల్లి రెవెన్యూ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చేయడంతో ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా కాలిపోయాయి. రికార్డులు కాలిపోవడంతో.. భూములకు సరైన హక్కుదార్లు ఎవరనే దానిపై వివాదం నెలకొంది. కొంతమంది భూమి లబ్ధిదారులు తమ భూములు తమకు కేటాయించాలని... గత సంవత్సరం రెవెన్యూ అధికారులను కోరగా.. వారు.. భూదాన యజ్ఞ బోర్డుకు లేఖ రాశారు. లబ్ధిదారులు సైతం హైదరాబాద్‌లోని భూదాన యజ్ఞం బోర్డు కార్యాలయానికి వెళ్లి.. తమకు కేటాయించిన భూములకు పట్టాలు చేసివ్వాలని కోరారు. కానీ భూదాన బోర్డు నుంచి ఇంతవరకూ ఎలాంటి సమాధానం రాలేదు. ఇక్కడ భూమి ధరలు... గత కొంతకాలంగా విపరీతంగా పెరిగాయి. ఎకరానికి 30 లక్షలకు పైగా ప్రస్తుతం పలుకుతోంది. భూమి ఖాళీగా ఉండడంతో రియల్ మాఫియా ఈ భూములపై కన్నేసింది. ప్రభుత్వ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉన్న 206 సర్వే నెంబర్లో వెంచర్లు చేయడం ప్రారంభించారు. గతంలో ఉపాధి హామీ కింద పెంచిన మొక్కలను పీకేసి, కుంటలను పూడ్చేసి గుట్టల ప్రాంతాన్ని చదును చేసి ప్లాటుగా మారుస్తున్నారు.

ఎవరికి మొరపెట్టుకున్నా..

ఈ భూముల లబ్ధిదారులు తమకు విక్రయించినట్టు స్టాంపు కాగితాలపై పలువురు సంతకాలు తీసుకొని.. కోట్ల విలువైన భూదాన భూముల్ని కాజేస్తుండడంతో.. లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. తమ గోడు ఎవరికి మొరపెట్టుకున్నా ఆలకించే నాధుడు లేరని వాపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూమికి.. రెవెన్యూ అధికారులు సరైన సర్వే నెంబర్లు కేటాయించడం లేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. జనగామకు దగ్గరగా ఉన్న స్థలాన్ని.. సైనిక పాఠశాల లాంటి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. అమాయక గిరిజనులను మోసం చేసి.. అక్రమార్కులు భూములను కాజేశారని ఆరోపిస్తున్నారు. జడ్పీ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తినా.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.

సమగ్ర సర్వే చేస్తేనే..

భూమి చదును చేయడమే కాకుండా.. విద్యుత్తు స్తంభాలు వేయించడం, రహదారులు నిర్మించి ఖరీదైన ప్లాట్లుగా చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్ 206 నిషేధిత భూమిగా ఉంది. ఇవన్నీ భూదాన భూములేనని అధికారులు చెబుతున్నారు. వీటిని కొనడం, అమ్మడం కానీ చెల్లదు. అయితే క్రయవిక్రయాలు తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. అసలు భూములెన్ని.. ఏ మేరకు అన్యాక్రాంతం అయ్యాయన్నదీ.. సమగ్ర సర్వే చేస్తేనే.. భూదాన భూముల్లో జరుగుతున్న భూదందా వెలుగులోకి వస్తుంది.

ఇదీచూడండి: 'అంటే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.