కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కళాకారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు దుకాణాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు.
యుముడు, యమభటుల వేషధారణలో ప్రజలకు కరోనా నుంచి రక్షణ చర్యలను వివరించారు. ఇళ్లల్లోనే ఉండాలని... అత్యవసర సమయంలో బయటకొస్తే నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రామారావు, కళాకారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వెళ్లలేరు.. ఉండలేరు..