జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో స్వయంగా అక్షరాలను దిద్దించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలతోపాటు, పాఠశాలలో అధునాతన సాంకేతిక విద్య అందిస్తున్నామని పాలనాధికారి వినయ్ కృష్ణ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : అక్రమ నిర్మాణదారులపైనే కూల్చివేత వ్యయం