అతి వేగంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు జనగామ జిల్లాలోని హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 నెలల క్రితం స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుతో జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు నెలల్లోనే ప్రభుత్వానికి రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని చెప్పారు.
అధిక వేగంతో వాహనం నడిపితే జరిమానాలు విధిస్తున్నామని, వాహనదారులు సూచిక బోర్డులను తప్పకుండా పాటించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి 'ప్లాస్టిక్‌పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'