జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ పరిసరాల్లో వానరాలకు ఔత్సాహికులు పండ్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ మూలంగా కొండగట్టు పుణ్యక్షేత్రంలో భక్తులకు దర్శనం లేకపోవటం వల్ల వానరాలు సమీప గ్రామాలకు వలస వెళ్తున్నాయి. ఇందులో భాగంగా నల్లగొండ గుట్ట సమీపంలో వానరాలు ఆహారం లేక చెట్ల ఆకులు తింటూ పొట్ట నింపుకుంటున్నాయి.
స్పందించిన గంగాధర మండలానికి యువకులు వానరాలకు అరటిపళ్ళు అందజేశారు. వందల సంఖ్యలో వానరాలు ఒకే దగ్గరకు చేరుకుని అరటి పళ్ళు ఆరగించాయి.
ఇవీ చూడండి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు ప్రారంభం