MARRIAGE DAY AT HUSBAND TOMB: కలకాలం కలిసి ఉంటానని పెళ్లినాడు బాసలు చేసిన భర్తను ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అయినా భర్త జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తూ బతుకుతున్నారు. గురువారం పెళ్లిరోజు కావడంతో ఆయన సమాధిని పూలతో అలంకరించి కేక్ కట్ చేసి పెళ్లి వేడుకలు చేసుకున్నారు. ఈ దయనీయ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకొంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కదిలించింది.

భర్త ఎలా మరణించాడంటే...
WEDDING DAY AT HUSBAND TOMB: 2014 మార్చి 3న ప్రవళికకు శేరి సుదర్శన్‌తో వివాహం జరిగింది. తండ్రి అనంత్‌ను దుబాయ్ విమానం ఎక్కించేందుకు తన పెద్దనాన్న కొడుకు రాజేందర్‌తో కలిసి సుదర్శన్ వెళ్లారు. విమానం ఎక్కించి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో శామీర్‌పేట వద్ద ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. పెళ్లైన నాటి నుంచి ప్రతి సంవత్సరం పెళ్లిరోజు వేడుకలు భార్యభర్తలు ఘనంగా నిర్వహించుకొనేవారు. ఈ ఏడాది కూడా భర్త సమక్షంలోనే జరుపుకోవాలని ఆయన సమాధి వద్ద కేక్ కట్ చేసింది.

ఇదీ చదవండి:'ఇండియా ఫ్లాగ్ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్..'