ETV Bharat / state

మీరు తప్పుచేసి పాత్రికేయులపై కేసులా..! - ఈసీ

జగిత్యాల జిల్లాలో ఈనెల 15న ఈవీఎం తరలింపులపై వార్తలను ప్రచురించిన పాత్రికేయులపై కేసులు పెట్డడాన్ని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, నిజామాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​ తప్పుపడ్డారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మీరు తప్పుచేసి పాత్రికేయులపై కేసులా..!
author img

By

Published : Apr 18, 2019, 7:14 PM IST

నిజామాబాద్​ పార్లమెంట్​ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో ఒక్కసారిగా పోలింగ్​ శాతం పెరగడంపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, నిజామాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​ అనుమానం వ్యక్తం చేశారు.

ఈనెల 15న ఈవీఎం తరలింపుపై వార్తలను ప్రచురించిన పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని జీవన్​రెడ్డి తప్పుపడ్డారు. అది వారి వృత్తి ధర్మమన్నారు. 10 తేదీనే అవగాహన కార్యక్రమాలు పూర్తయితే 15 వరకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​తో సహా అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయన్నాయని మధుయాస్కీ తెలిపారు. పాత్రికేయులకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని.. వారిపై పెట్టిన కేసులను సత్వరమే ఎత్తేయాలని డిమాండ్​ చేశారు.

మీరు తప్పుచేసి పాత్రికేయులపై కేసులా..!

ఇవీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వానిది పైశాచిక చర్య: దత్తాత్రేయ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.