దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జగిత్యాలలోని మార్కండేయ ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. నవదుర్గా సేవసమితి ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. లలితా పంచమి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాలు .. ఆలయానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. ఉదయం మహాపూజ, మంత్ర పుష్పం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ అయితే ఆనందమే!