జగిత్యాల జిల్లాలో ఇవాళ మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటితో కలిపి మొత్తం పాజిటవ్ కేసుల సంఖ్య 8కి చేరింది. ముంబయి నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు. ఇవాళ ధర్మపురి మండలంలో ఒకరికి, కథలాపూర్ మండలంలో మరొకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ఆయా గ్రామాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి 3,361 మంది జిల్లాకు చేరుకోగా వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ