ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడితో పసుపు సాగు చేస్తే పెట్టుబడి పైసలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.15,000 ప్రకటించాలని జగిత్యాల జిల్లా కర్షకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా... పసుపు రైతుల బతుకులు మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన సుగంధ ద్రవ్యాల బోర్డుతో ఒరిగేదేం లేదని, చేతికొచ్చిన పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు.