జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డ్లో ఉన్న ఒక్క కాల్వ మూసుకుపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లలేక పసుపు కుప్పల వద్దే నిలిచి పోయింది. పసుపు పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. మురుగు కాల్వను శుభ్రం చేసుకొని వర్షపు నీటిని బయటకు తరలించారు.
తడిసిన పసుపును కొనుగోలు చేయండి..
ఇంత చేసి పంటను కాపాడుకున్నా మద్దతు ధర లేకపోవడం వల్ల కర్షకులు ఆవేదనకు గురవుతున్నారు. తడిసిన పసుపును కొనుగోలు చేయాలని రైతులు మార్కెట్ కార్యాలయానికి తరలొచ్చారు. కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల జాతీయ రహదారిపై ధర్నా చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మార్కెట్ సూపర్ వైజర్ రమణ రైతుల వద్దకు వచ్చి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు